ఇంకా రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వరంగల్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ సూచించారు. హన్మకొండలో జలమయమైన కాలనీ వాసులు ఎలాంటి ఆందోళన చెందొద్దని... జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాల్‌లో వసతి కల్పిస్తున్నామని చెప్పారు.
ఎప్పటికప్పుడు అధికారులు నాలాలను పరిశీలిస్తున్నారని అన్నారు. అధిక వర్షం వల్ల కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ను నిలిపివేశామని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.