సంక్షేమ పథకాలతో పాటు కుల వృత్తులు అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలంలోని పెద్ద చెరువులో 4 లక్షల 75 వేల చేప పిల్లలను ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు.
ముదిరాజ్ కులస్థులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని చెరువుల్లో ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షల చేప పిల్లలను విడుదల చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. 'నవ భారతం కోసమే వ్యవసాయ సంస్కరణలు'