లాక్ డౌన్ వేళ ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ నిత్యావసర సరుకులను అందజేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్ లో సరుకులు పంపిణీ చేశారు.
ఇంకా కొన్ని రోజులు ప్రజలు ఓపిక పట్టి... ఇళ్ల వద్దనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా... ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు.