వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హాజరయ్యారు. ప్రజల సమస్యలు తీర్చే విధంగా అధికారులు కృషి చేయాలని మార్గనిర్దేశం చేశారు. గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
అనంతరం లబ్ధిదారులకు రూ. 2 లక్షల 70 వేల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులకు జరిగిన పంట నష్టంపై పూర్తి నివేదిక రూపొందించి.. అన్నదాతలకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి : ఈ దాడి మతోన్మాద శక్తుల పనే..!: చాడ వెంకట్ రెడ్డి