ETV Bharat / state

నష్టపోయిన వారిని కచ్చితంగా ఆదుకుంటాం: ఎమ్మెల్యే - బీభత్సం సృష్టించిన గాలివాన

సోమవారం రాత్రి వరంగల్​ పట్టణ జిల్లా భీమారంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఇళ్లు, ఫంక్షన్​హాల్​, చెట్లు కూలిపోయాయి. ఎమ్మెల్యే అరూరి రమేష్​ గ్రామాన్ని సందర్శించి.. నష్టపోయిన వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

mla visit damage houses
mla visit damage houses
author img

By

Published : May 19, 2020, 1:29 PM IST

ఈదురుగాలులు, అకాల వర్షంతో నష్టపోయిన వారిని కచ్చితంగా ప్రభుత్వపరంగా ఆదుకుంటామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. సోమవారం రాత్రి వరంగల్​ పట్టణ జిల్లా హసన్​పర్తి మండలం భీమారంలో గాలివాన భీభత్సం సృష్టించింది. పలు ఇళ్లు, ఫంక్షన్ హల్, చెట్లు కూలిపోయాయి. సుమారు కోటి రూపాయల ఆస్తినష్టం జరుగగా.. ఓ వ్యక్తి చనిపోయాడు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేష్ అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. కూలిపోయిన ఇళ్లను, ధ్వంసమైన ఫంక్షన్ హాల్​ను పరిశీలించారు. అకాల వర్షంతో నష్టపోయిన వారిని కచ్చితంగా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: నగరంలో దుకాణాలు తెరుచుకున్నాయ్​.. అతిక్రమిస్తే అంతే ఇక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.