కరోనా కష్టకాలంలోనూ తెరాసా పేదలకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (Aroori Ramesh) అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలానికి చెందిన 102 మంది లబ్ధిదారులకు రూ.కోటి 2లక్షల 832 విలువగల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం.. పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలో సైతం ఆడపిల్లల పెళ్లికి తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. అనంతరం మండలానికి చెందిన 14మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 9లక్షల 43వేల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: corona: పొగరాయుళ్లపై పగబడుతోంది!