వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మిర్చి ధర తగ్గడం వల్ల రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తేజ రకం మిర్చిని మూడు రోజుల క్రితం రూ.21 వేలు పలకగా... నేడు రూ.9 వేలకే కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ధర్నా చేపట్టారు.
దళారులంతా కుమ్మక్కై మిర్చి రేటు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల ఆందోళనతో మార్కెట్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇవీ చూడండి: నేటి నుంచి దావోస్లో కేటీఆర్ పర్యటన