యువతకు ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన వృతి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఇప్పటి వరకు మహబూబ్‌నగర్, ఖమ్మం, ఇప్పుడు వరంగల్‌లో ప్రారంభించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన వారికి గల్ఫ్ దేశాలలో మంచి స్పందన ఉందని... ఈ సర్టిఫికెట్‌కు పాలిటెక్నిక్ చదివిన అర్హత ఉందని వివరించారు. డిమాండ్‌ను బట్టి ఇంకా మరిన్ని కోర్సులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఈ శిక్షణ కేంద్రంలో టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషన్లు, మగ్గం వర్క్స్, కంప్యూటర్ ట్రైనింగ్, సీసీ కెమోరా, మొబైల్ సర్వీసింగ్ వంటి తదితర వాటికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ పాల్గొన్నారు.