ETV Bharat / state

పేదల సంక్షేమం, అభివృద్ధే తెరాస లక్ష్యం: మంత్రి సత్యవతి - తెలంగాణ వార్తలు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నగరంలోని 44వ డివిజన్​లో మంత్రి సత్యవతి రాఠోడ్ పర్యటించి... తెరాస అభ్యర్థి కంకణాల శ్రీదేవి తరఫున ప్రచారం చేశారు. తెరాస ప్రవేశపెట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు.

minister sathyavathi rathod, warangal municipal elections
మంత్రి సత్యవతి రాఠోడ్, వరంగల్ మున్సిపల్ ఎన్నికలు
author img

By

Published : Apr 24, 2021, 12:08 PM IST

ఎవరికి ఓటు వేస్తే పేదల సంక్షేమానికి ఉపయోగపడుతుందో ఆలోచించి ఓటు వేయాలని మంత్రి సత్యవతి రాఠోడ్ విజ్ఞప్తి చేశారు. గతంలో ఎవరో ఒకరు చనిపోతేనే వేరేవారికి పింఛన్ వచ్చేదని గుర్తు చేశారు. కానీ నేడు అర్హులందరికీ పింఛన్ ఇస్తున్నారని తెలిపారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేరిట పేదింటి పెళ్లికి ఆర్థిక సాయం చేస్తున్నారని చెప్పారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 44వ డివిజన్ అల్లిపురంలో తెరాస అభ్యర్థి కంకణాల శ్రీదేవి తరఫున ప్రచారం చేశారు.

ప్రచారంలో భాగంగా తెరాస ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మంత్రి వివరించారు. రైతు బంధు, రైతు బీమా వంటివి చేపట్టి ప్రభుత్వం రైతుకు అండగా ఉంటోందని అన్నారు. గతంలో 24 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే... నేడు సీఎం కేసీఆర్ చొరవతో కోటి 30 లక్షల ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, చేప పిల్లల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసిఆర్ అని అన్నారు.

భాజపా, కాంగ్రెస్​లు ఎన్నికల సమయంలోనే వస్తాయని... ఇలాంటి పార్టీలకు ఓటు వేయడం కంటే ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడే తెరాసకి ఓటు వేయాలని అభ్యర్థించారు. తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో మంథని జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, డివిజన్ ఇంఛార్జి మర్నేని రవీందర్ రావు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మన ప్రమేయం లేకుండానే శానిటైజ్ చేసేస్తాయి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.