ETV Bharat / state

Minister KTR Speech in Warangal Tour : పింఛన్ల పెంపు, ఆడబిడ్డలకు సాయంపై త్వరలోనే శుభవార్త: మంత్రి కేటీఆర్ - ఐటీ హబ్స్​పై కేటీఆర్ స్పీచ్

Minister KTR Speech in Warangal Tour : పింఛన్ల పెంపు, ఆడబిడ్డలకు సాయంపై త్వరలోనే ముఖ్యమంత్రి శుభవార్త చెబుతారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తొమ్మిదన్నరేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ఓటువేయాలని.. ప్రతిపక్షాలు చెప్పే మాయమాటలు నమ్మి గందరగోళానికి గురికావద్దని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

IT Minister KTR
IT Minister KTR Warangal Tour
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2023, 3:51 PM IST

Updated : Oct 6, 2023, 8:29 PM IST

Minister KTR Speech in Warangal Tour : ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు సమయం సమీపించిన దశలో.. జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. శుక్రవారం హనుమకొండ, వరంగల్, కాజీపేట త్రినగరిలో సుడిగాలి పర్యటన చేశారు. అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. ఐటీ రంగంలో భవిష్యత్ రెండు నగరాలలోనే ఉందన్నారు. రాబోయే పదేళ్లలో (IT Hubs) హైదరాబాద్, వరంగల్​కు పెద్ద తేడా ఉండదని ధీమా వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో యువతకు ఉన్న అవకాశాలు తెలియజేశారు. రాష్ట్రంలో ఐటీ హబ్, యువత ఉపాధి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. వరంగల్​లోనే కాకుండా భీమవరం, నెల్లూరులో కూడా ఐటీ సంస్థలు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని ఎన్నారైలను కోరుతున్నానని కేటీఆర్ తెలిపారు. బెంగళూరు ఐటీ రంగంలో 40 శాతం మన తెలుగువాళ్లేనన్నారు. ఉన్నచోటే మన యువతకు ఉపాధి దక్కాలన్నారు. బెంగళూరు నుంచి వచ్చేందుకు తెలుగు ఐటీ ఉద్యోగులు రెడీగా ఉన్నారని.. వారికి తగిన అవకాశాలు కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8 ఐటీ హబ్​లు పెట్టామని తెలిపారు. యువత ఉద్యోగ కల్పన కోసమే ఐటీ హబ్​లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

Kaynes Tech Invests in Hyderabad : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ.2800 కోట్లు పెట్టనున్న కెయిన్స్ టెక్

Minister KTR on IT Hubs In Telangana : ఇందులో భాగంగా హైదరాబాద్​తో పాటు వరంగల్‌, ఖమ్మం, నల్గొండ వంటి నగరాలు పట్టణాలకు కంపెనీలను తీసుకువస్తున్నామని కేటీఆర్ వివరించారు. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన (Minister KTR) కేటీఆర్‌... రూ.900 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో మంత్రి కేటీఆర్​ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

ముందుగా హనుమకొండ, కాజీపేట, వరంగల్‌లో రూ.900 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.70 కోట్లతో హనుమకొండ బస్​స్టాండ్​కు శంకుస్థాపన చేశారు. రూ.100 కోట్లతో ఐటీ టవర్, రూ.9కోట్లతో దోబీఘాట్, బల్దియా ఆధ్వర్యంలో రూ.332 కోట్ల వ్యయంతో భద్రకాళీ బండ్ సస్పెన్షన్ బ్రిడ్జి, రూ.26.13 కోట్లతో 15 ఎంఎల్​డీ సామర్థ్యంతో నిర్మించిన మురుగు నీటి శుద్దీకరణ కేంద్రం, కాజీపేట ఎన్​ఐటీ వద్ద రూ.30 లక్షలతో ముస్తాబైన కూడలిని ప్రారంభించారు. మడికొండ ఐటీ పార్కులో రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన క్వాడ్రంట్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీని కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా 500 మందికి ఉపాధి లభించనుంది.

Minister KTR Visited Kakatiya University in Warangal : మడికొండ ఐటీ పార్కులో నూతనంగా నిర్మించిన క్వాడ్రంట్ సాఫ్ట్​వేర్ కంపెనినీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఐకాస నాయకులు మంత్రిని కలిశారు. వర్సిటీలో జరిగిన అవకతవకలను విద్యార్థి సంఘాల నాయకులు మంత్రికి వివరించారు. పీహెచ్​డీ ప్రవేశాల్లో అక్రమాలపై విచారించి.. వారంలోగా న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేపట్టిన ఆశావర్కర్లు కేటీఆర్‌ను కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

IT Minister KTR Warangal Tour దేశ భవిష్యత్ అంతా హైదరాబాద్ బెంగళూరు నగరాల్లోనే మంత్రి కేటీఆర్

KTR on Hyderabad Development : 'హైదరాబాద్‌పై చిన్న మచ్చ పడినా.. అందరికీ ఇబ్బంది కలుగుతుంది'

KTR Comments on Congress and BJP : కాంగ్రెస్​ తరఫున గెలిచిన వాళ్లు.. బీజేపీలోకి జంప్‌ అవుతారు: మంత్రి కేటీఆర్

Last Updated : Oct 6, 2023, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.