కరోనా విజృంభిస్తున్న వేళ.. మాస్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మాస్కులు ధరించనిదే ఎవ్వరూ బయటకు రావట్లేదు. ఫలితంగా మార్కెట్లో మాస్కుల కొరత నెలకొంది. దీనిని అధిగమించేందుకు కొందరు స్వంతంగా మాస్కులను తయారు చేస్తూ.. ప్రజలకు అందిస్తున్నారు.
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఎవరికి చేతనైన సహాయం వారు చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి మాతృమూర్తి ప్రభ పారిశుద్ధ్య కార్మికుల కోసం మాస్కులు కుడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పీహెచ్డీ పూర్తి చేసిన ప్రభ.. కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. కుట్లు అల్లికలు రావడం వల్ల నగరంలోని పారిశుద్ధ్య కార్మికుల కోసం స్వతహాగా సుమారు 200 మాస్కులు కుట్టారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆమెను అభినందించారు.
![Minister KTR Congratulations to Pamela Satpathi's Mother](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6590279_nl.png)
ఇదీ చూడండి: ఆపరేషన్ కరోనా: ఇరాన్ నుంచి భారత్కు మరో 275 మంది