ETV Bharat / state

దేశానికి ఎప్పటికైనా అన్నం పెట్టే సత్తా కేవలం తెలంగాణదే: మంత్రి ఈటల - వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం వార్తలు కమలాపూర్​

దేశానికి అన్ని రాష్ట్రాలు కలిపి ఇచ్చే 1.05 లక్షల కోట్ల మెట్రిక్​ టన్నుల ధాన్యంలో.. 64 లక్షల మెట్రిక్​ టన్నులు తెలంగాణవే అని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. దేశానికి ఎప్పటికైనా అన్నం పెట్టే సత్తా కేవలం మన రాష్ట్రానిదేనని పేర్కొన్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా కమలాపూర్​లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​ కుమార్​తో కలిసి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు.

దేశానికి ఎప్పటికైనా అన్నం పెట్టే సత్తా కేవలం తెలంగాణదే: మంత్రి ఈటల

author img

By

Published : Oct 30, 2020, 6:43 PM IST

దేశానికి ఎప్పటికైనా అన్నం పెట్టే సత్తా కేవలం తెలంగాణదే: మంత్రి ఈటల

ఈ దేశానికి ఎప్పటికైనా అన్నం పెట్టే సత్తా కేవలం తెలంగాణ రాష్ట్రానికే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పర్యటించారు. కమలాపూర్ సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ధాన్యం నిల్వలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మంత్రి మాట్లాడి ఆరా తీశారు.

దేశానికి 1.05 లక్షల కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని.. అన్ని రాష్ట్రాలు కలిసి కేంద్రానికి ఇస్తే అందులో 64 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఇచ్చిన ఘనత తెలంగాణదేనని మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. కాళేశ్వరం నీళ్లతో పంటల సాగు పెరిగిందన్నారు. సన్న రకం వడ్లు గ్రేడ్‌- ఏ అని కోట్లాడామని పేర్కొన్నారు. సన్న రకం వడ్లను గ్రేడ్‌-ఏ కింద మార్చామన్నారు. సివిల్‌సప్లై శాఖలో తాను పని చేసినప్పుడు రాష్ట్రంలో 2.70 కోట్ల మందికి బియ్యం పంపిణీ చేశామని గుర్తు చేశారు. రైతులు పండించిన సన్న బియ్యం పేదలకే వెళ్తుందన్నారు.

ఇదీ చదవండి: చాడ పుస్తకం రాశారు... ఈటల ఆవిష్కరించారు...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.