శ్రీప్లవ నామ సంవత్సరంలో మంచి వర్షాలు కురిసి మరిన్ని పంటలు పండి, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని పంచాంగ శ్రవణ కర్తలు పేర్కొన్నారని... మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్లు అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా హన్మకొండ వేయి స్తంభాల ఆలయంలో వారు రుద్రేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం నిర్వహించారు.
వరంగల్ కూడా మంచి అభివృద్ధి సాధిస్తుందని, వారి మాటల ప్రకారం అభివృద్ధి చేసి తీరుతామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. కరోనా తొలగిపోయి, ప్రజలు భయాందోళనలు లేకుండా హాయిగా ఆయురారోగ్యాలతో తిరిగే రోజులు రావాలని కోరుకున్నారు.
గత కాలం చెడు మొత్తం పోవాలన్నారు. ఈ ఉగాది కొత్త వెలుగులు విరజిమ్మాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. వరంగల్ మహా నగర కార్పొరేషన్ అభివృద్ధి కోసం కేటీఆర్ చేతుల మీదుగా 2,500 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నామని గుర్తుచేశారు.
ఇదీ చూడండి : 'మంత్రి వస్తున్నాడనే.. అక్రమ అరెస్టులు'