వరంగల్ నగరానికి నూతన వైభవాన్ని తీసుకురావడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ ఫాతిమా కూడలిలో వావ్ వరంగల్ వాటర్ ఫౌంటెన్‌ని మంత్రి ప్రారంభించారు.
వరంగల్ నగరానికి ఘనమైన చరిత్ర ఉందని.. దాన్ని ప్రతిబింబించేలా త్రినగరికి ప్రారంభంలో ఈ చిహ్నాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. వరంగల్ భద్రకాళి బండ్ సుందరీకరణ, కాజీపేట రైల్వేట్రాక్‌పై పాత వంతెనకు సమాంతరంగా మరో వంతెన నిర్మాణానికి నిధులు విడుదల చేశామన్నారు. రానున్న రోజులలో మరిన్ని నిధులను విడుదల చేసి నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.