వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా రోగులకు అందిస్తున్న సేవలపై జిల్లా అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షించారు. ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ రోగుల కోసం 440 పడకలకు గాను 230 పడకలు ఖాళీగా ఉన్నాయని కార్యనిర్వాహణాధికారి తెలిపారు. కమలాపూర్‌లో 40 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
అక్టోబర్ 15 నాటికి కాకతీయ వైద్య కళాశాలలోని 230 పడకల పీఎన్ఎస్ఎస్వై ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. కొవిడ్ రోగులకు వైద్యులు అందుబాటులో ఉండే విధంగా ఎంజీఎం ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుల ఫోన్ నెంబర్లను వార్డుల్లో ఏర్పాటు చేయాలని కార్యనిర్వహణ అధికారి నాగార్జున రెడ్డికి సూచించారు.
ఇదీ చూడండి: నూతన ఆబ్కారీ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రులు