ETV Bharat / state

ప్రశ్నించే గొంతుక కాదు... పరిష్కరించే గొంతుక కావాలి: ఎర్రబెల్లి - తెలంగాణ వార్తలు

ఉద్యోగులపై సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వారి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హన్మకొండలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

minister-errabelli-dayakar-rao-participated-in-mlc-election-campaign-at-hanamkonda-in-warangal-urban-district
ప్రశ్నించే గొంతు కాదు... పరిష్కరించే గొంతుక కావాలి: ఎర్రబెల్లి
author img

By

Published : Mar 12, 2021, 12:32 PM IST

రాష్ట్రంలో ఇప్పుడు ప్రశ్నించే గొంతుక కాదు... పరిష్కరించే గొంతుక కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌కు ఉద్యోగులపై ఎనలేని ప్రేమ ఉందని అన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగుల కన్నా రాష్ట్ర ఉద్యోగులకు రెండు, మూడు శాతం ఎక్కువ పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు.

ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులందరూ ఆలోచించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతు తెలపాలని కోరారు. అత్యధిక మెజారిటీతో పల్లాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: 'తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులకు టీజీపీఏ మద్ధతు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.