ఈటీవీ భారత్ కథనానికి పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సానుకూలంగా స్పందించారు. వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలోని విశ్వనాథ్ కాలనీ 50 ఫీట్ల రహదారి ఆక్రమణ అంశాన్ని నేడు చర్చించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్థన్నపేట శాసనసభ సభ్యుడు ఆరూరి రమేష్ క్యాంపు కార్యాలయన్ని ఇటీవలే తొలగించామని తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లకు సూచించారు. హన్మకొండలోని అంబేడ్కర్ భవన్లో ఏర్పాటు చేసిన వరంగల్ మహా నగర పాలక సంస్థ సర్వసభ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హజరయ్యారు.
తనకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఎలా తొలిగించారని సర్వసభ సమావేశంలో ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ దామోదర్ యాదవ్ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. రోడ్డు ఆక్రమించి నిర్మాణం చేసింది వాస్తవమని గుర్తించి... కూల్చివేశామని అధికారులు వెల్లడించారు. మిగితా ఇంటి యాజమానులకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం సహించదని కార్పొరేటర్ దామోదర్ యాదవ్కు మంత్రి నచ్చజెప్పారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. కార్పొరేటర్ ఇల్లు నేలమట్టం