ETV Bharat / state

Minister Errabelli: తెలంగాణ విజయగర్జన సభాస్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి - telangana varthalu

తెరాస ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నవంబర్15న వరంగల్‌లో నిర్వహించనున్న తెలంగాణ విజయగర్జన సభాస్థలాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. సభాస్థలి గురించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

Minister Errabelli: తెలంగాణ విజయగర్జన సభాస్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

author img

By

Published : Oct 16, 2021, 10:11 PM IST

తెరాస ద్విదశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నవంబర్ 15న వరంగల్​లో నిర్వహించనున్న 'తెలంగాణ విజయగర్జన' సభాస్థలాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు రమేశ్, నరేందర్‌తో కలిసి పరిశీలించారు. వరంగల్ మామునూరులోని స్థలాన్ని మంత్రి పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్ స్థలం, హాజరయ్యే కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు సరిపోయే విధంగా ఉంటుందా? అనే విషయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇతరత్రా ఇంకా ఏమైనా స్థలాలు ఉన్నాయా? అనే విషయాన్ని కూడా మంత్రి పరిశీలిస్తున్నారు.

అన్ని హంగులతో సభ విజయవంతం కావడానికి అవసరమైన స్థలం అవసరమని.. అందుకు అన్ని విధాలుగా అనువైన స్థలం కావాల్సి ఉందని మంత్రి అన్నారు. ఆ సభకు సీఎం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరై మాట్లాడతారని మంత్రి తెలిపారు. తెరాస పార్టీ స్థాపించి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలనుద్దేశించి పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని నివేదిస్తారని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: etela rajender: 'ఉపఎన్నికల్లో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మరి మీరు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.