ETV Bharat / state

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?: ఎర్రబెల్లి

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు భాజపా పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. బోగస్ పార్టీలను నమ్మి ఓట్లు వేయవద్దని ఆయన సూచించారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో గ్రేటర్ వరంగల్​లో పర్యటించారు.

minister errabelli dayakar rao
వరంగల్​లో ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
author img

By

Published : Apr 27, 2021, 12:43 PM IST

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసే భాజపాకు ఓట్లడిగే నైతిక హక్కు లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు భాజపా పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో భాగంగా ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నగరంలోని పోచమ్మ మైదానం, తిలక్ రోడ్డు, వెంకట్రామ జంక్షన్, లక్మీ టాకీస్ ప్రాంతాల్లో రోడ్​ షో నిర్వహించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన భాజపా... ప్రజలను మోసం చేసిందని మంత్రి ధ్వజమెత్తారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం తపించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని​ అన్నారు.

ఇదీ చూడండి: ఆసక్తికరంగా మారుతున్న నకిరేకల్‌ పురపాలిక ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.