భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిచ్చిపిచ్చి మాటలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాకా తెలంగాణ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.
రైతుబంధు, రైతుబీమా ఎక్కడ లేదు. ఇన్ని వర్షాలు వచ్చినా... వరదలొచ్చినా ఒక్క చెరువు కూడా తెగలేదు. కాళేశ్వరం, దేవాదుల పూర్తిచేసుకుని 365 రోజులు నీళ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. బండి సంజయ్ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి నిలబెట్టుకోలేదు. తెలంగాణకు మెడికల్ కాలేజీలు కావాలని రాస్తే... కరీంనగర్‌కు కూడా తెచ్చుకోలేని మనిషి నువ్వు. ఇవాళ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా మేము ఎంతైన కొంటం. ఎఫ్‌సీఐ వాళ్లని అనుమతి ఇవ్వమనండి. రెండేళ్లలో మీరు ఎక్కడైనా కొన్నారా? మన రాష్ట్రంలో ప్రతి గింజను కొన్నాం.
-- ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్ మంత్రి
ఇదీ చూడండి: Bandi Sanjay press meet: 'వరి కావాలా.? ఉరి కావాలా.?.. కేంద్రంతో మరింత ధాన్యం కొనిపిస్తాం'