వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మధ్య ఆసక్తికర చర్చ నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మన్ల సదస్సులో... తమ నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని... సరైన నిధులు ఇవ్వడం లేదని రెడ్యా నాయక్ ఆరోపించారు. దీనిపై స్పందించిన మంత్రి... 'మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు' అని ప్రశ్నించారు.
తాను మంత్రి పదవిని ఎవరి దగ్గరి నుంచి గుంజుకోలేదని రెడ్యా నాయక్ అన్నారు. వైఎస్ఆర్ మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. 'మీకు మంత్రి వస్తుంది' అని ఎర్రబెల్లి దయాకర్ రావు అనగా... 'మీరు ఉండగా నాకు మంత్రి పదవి రాదు' అని అన్నారు. మంత్రి దయాకర్ రావును తక్కువ అంచన వేయవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర మంచి పలుకుబడి ఉందని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో కొత్త సహకర బ్యాంకు ఏర్పాటు చేసి నిధులు ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: నీతి ఆయోగ్ మెచ్చిన టీడీఆర్.. స్థిరాస్తి వ్యాపారుల మొగ్గు!