Errabelli comments on BJP కాంగ్రెస్ పార్టీ సీఎం పదవీ ఇస్తానంటే వదులుకున్న వ్యక్తి కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఎలాంటి మచ్చలేదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపా కావాలనే తెరాస నేతలను భయభ్రంతులకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు. భాజపా నేతలు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టాలని చూస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు.
కేసీఆర్ కుటుంబంపై అసత్య ఆరోపణలు భాజపా నేతలకు తగదు. కేసులకు ఐటీ సోదాలకు మేం భయపడం. బండి సంజయ్ చుట్టూ ఉండేది కార్యకర్తలు కాదు. బండి సంజయ్ చుట్టూ ఉండేది బౌన్సర్‌లు, గుండాలే. బండి సంజయ్ పాదయాత్ర పేరుతో నటన. కేసీఆర్ కుటుంబంపై దాడి చేస్తే సహించేది లేదు.- ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి
ఎమ్మెల్సీ కవితపై భాజపా నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబంపై ఎలాంటి మచ్చలేదని మంత్రి తెలిపారు. కేసీఆర్‌కు ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకున్నారని వెల్లడించారు.
ఇవీ చదవండి: Rajasingh arrest నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత, ఇరువర్గాలపై లాఠీఛార్జ్