సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాలు వరంగల్‌లో జరపడం గర్వంగా ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హన్మకొండలోని వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు జర్నలిజం పరిణామక్రమం సదస్సుకు మంత్రితో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరయ్యారు.
జర్నలిస్టులందరు సురవరం ప్రతాపరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆయన జర్నలిస్టుగా, ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు అందించారన్నారు. జర్నలిస్టుల సమస్యలు త్వరలో తీరుస్తామన్నారు. మహాకవి బొమ్మెర పోతన సమాధిని రూ. 10 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. జర్నలిస్టులు కరోనా సమయంలో ప్రాణాన్ని లెక్క చేయకుండా పనిచేశారన్నారు.
ఇదీ చదవండి: చైతన్యపురిలో కారు బీభత్సం.. సీసీలో దృశ్యాలు నిక్షిప్తం