ETV Bharat / state

'ఎన్నికలను సమర్థంగా నిర్వహిద్దాం'

పురపోరుకు ఎన్నికల నగారా మోగడంతో... గ్రేటర్ వరంగల్ పరిధిలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్ ఎల్బీ కళాశాల, హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో నామినేషన్లను స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

metropolitan-corporation-election-arrangements-at-warangal
'ఎన్నికలను సమర్థంగా నిర్వహిద్దాం'
author img

By

Published : Apr 16, 2021, 7:20 AM IST

మహా నగర పాలక సంస్థ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వరంగల్​ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినందున ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఎన్నికల కోడ్‌ అమలు, బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ, రవాణా, సామగ్రి, కాల్‌ సెంటర్‌ ఏర్పాటు తదితర అంశాలపై సంబంధిత నోడల్‌ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు.

కోడ్‌ అమలయ్యేందుకు డీఆర్‌డీవోను నోడల్‌ అధికారిగా నియమించారు. సూక్ష్మ పరిశీలకులుగా సీపీవో, ఎల్‌డీఎం వవ్యవహరిస్తారన్నారు. కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా పోలింగ్‌ కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పీవో, ఏపీవోలకు కొవిడ్‌ 19కు అనుగుణంగా శహక్షణ ఇవ్వాలన్నారు. బ్యాలెట్‌ బాక్సుల నిర్వహణ, రవాణా, కాల్‌ సెంటర్‌, హెల్ప్‌లైన్‌, ఫిర్యాదుల సెల్‌ ఏర్పాటు, లా అండ్‌ ఆర్డర్‌, మీడియా సెంటర్‌ నిర్వహణ వంటి ఏర్పాట్లకు అధికారులను నియమించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్‌వో వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఆత్మహత్యలు చేసుకోవద్దు.. నిరుద్యోగుల కోసం పోరాడతా:షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.