సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... వరంగల్ నగరంలో వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. లేబర్ కాలనీలోని అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల విద్యార్థులు తరగతి గదులను బహిష్కరించి ధర్నాకు దిగారు. కళాశాలలో సిబ్బంది కొరత ఉన్నట్లు తెలిపారు. 33 మందికి బదులు ఎనిమిది మంది ఫ్యాకల్టీ మాత్రమే ఉన్నందున తరగతి గది నిర్వహణ సరిగ్గా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది కొరతతో నాణ్యమైన విద్య అందించడంలో అధ్యాపకులు విఫలమవుతున్నారని వాపోయారు. కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు, త్వరితగతిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీచూడండి: నగరానికి పండుగ శోభ.. లష్కర్ బోనాలు షురూ..