9 Medical Colleges Inauguration in Telangana : రాష్ట్ర సర్కార్ వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందనడానికి తాజాగా అందుబాటులోకి వచ్చిన 9 వైద్యకళాశాలలే నిదర్శనమని మంత్రులు అన్నారు. ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమంలో ఆయా జిల్లాలవారిగా పాల్గొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ మెడికల్ కళాశాలను ప్రారంభించారు. గత నాయకుల పాలనలో విద్య, వైద్య రంగాలు మరుగున పడ్డాయని.. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో వాటికి పెద్దపీట వేశామన్నారు. దేశంలో 27 రాష్ట్రాలు కలిసి సంవత్సరానికి 57శాతం డాక్టర్లను ఉత్పత్తి చేస్తే ఒక్క తెలంగాణ 43శాతం డాక్టర్లను తయారుచేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ చూపుతుందని విమర్శించారు.
"ప్రధాని మోదీ దేశంలో 157 వైద్య కళాశాలలు మంజూరు చేశారు. అందులో రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదు. తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ ఎందుకు అని అడిగాం. మోదీ ఇవ్వకపోయినా రాష్ట్రంలో కాలేజీలు నిర్మించి.. దేశానికే ఆదర్శంగా నిలిచాం."-కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి
-
Strange PM who can’t acknowledge his own Indian state #TriumphantTelangana
— KTR (@KTRBRS) July 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
✅ State with Highest per capita income growth in India (₹3.17 Lakhs)
✅ First state to provide drinking water to all homes & inspired Jal Jeevan Mission
✅ State that completed World’s largest lift…
">Strange PM who can’t acknowledge his own Indian state #TriumphantTelangana
— KTR (@KTRBRS) July 8, 2023
✅ State with Highest per capita income growth in India (₹3.17 Lakhs)
✅ First state to provide drinking water to all homes & inspired Jal Jeevan Mission
✅ State that completed World’s largest lift…Strange PM who can’t acknowledge his own Indian state #TriumphantTelangana
— KTR (@KTRBRS) July 8, 2023
✅ State with Highest per capita income growth in India (₹3.17 Lakhs)
✅ First state to provide drinking water to all homes & inspired Jal Jeevan Mission
✅ State that completed World’s largest lift…
Minister Inaugurates Medical Colleges : ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డిలో వైద్యకళాశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న స్పీకర్.. రాష్ట్రంలో 5 వైద్య కళాశాలలు ఉంటే వాటిని 28కి పెంచిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని కొనియాడారు. పేదప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంలో రాష్ట్రం.. విప్లవాత్మకమైన ప్రగతిని సాధించిందని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను ప్రారంభించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాలను మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి(Indra Karan Reddy) ప్రారంభించారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాల ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలంపల్లి దర్గాలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ.. జిల్లాతో పాటు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
CM KCR Inaugurates 9 Medical Colleges : 'వైద్యవిద్యలో నవశకం.. ఒకేరోజు 9 వైద్య కాలేజీలు ప్రారంభించడం శుభపరిణామం'
9 Medical Colleges opened in Telangana : ఒకప్పుడు కోట్లు ఖర్చుపెట్టి విదేశాలకు వెళ్లి వైద్య విద్యను చదివేవారని.. అలాంటి వైద్య విద్య నేడు పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి వైద్య కళాశాలను ప్రారంభించారు. కేసీఆర్ చలువ వల్లే జిల్లాకు వైద్యకళాశాల మంజూరైందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. జనగామ చెంపక్ హిల్స్‌లో నూతనంగా నిర్మించిన కాలేజీని ప్రారంభించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. మెడికల్ కళాశాలల ఏర్పాటు కేసీఆర్ దాతృత్వానికి నిదర్శనమన్నారు. వైద్య రంగానికి పెద్దపీట వేసిన సీఎం కేసీఅర్ నవశకానికి నాంది పలికారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్(Puvvada Ajay Kumar) పేర్కొన్నారు. ప్రగతి భవన్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 9 నూతన వైద్య కళాశాలలను వర్చువల్ పద్దతిలో ప్రారంభించగా.. ఖమ్మం ప్రభుత్వ వైద్యకళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.
9 Medical Colleges Inauguration in Telangana : నేడు 9 మెడికల్ కళాశాలలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్