కొవిడ్ చికిత్స కోసం వచ్చి మావోయిస్టు డివిజనల్ కమిటీ కార్యదర్శి, కొరియర్లు వరంగల్ పోలీసులకు చిక్కారు. మట్వాడా పోలీసులు ములుగు రోడ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా... కారులో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన దండకారుణ్య స్పెషల్ జోన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ (అలియాస్ మోహన్), మరొక మైనర్ వ్యక్తిని కొరియర్‌గా గుర్తించారు.
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కొండపల్లికి చెందిన మధుకర్, పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1999లో సిర్పూర్ దళంలో చేరాడు. ఆ మరుసటి సంవత్సరంలో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి బదలీ అయ్యాడు. నాటి నుంచి పార్టీ అగ్రనాయకులతో కలసి పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొనడంతోపాటు... పోలీసులను హత్యం చేయడం, ఆయుధాలను అపహరించిన ఘటనల్లో నిందితుడు. ఇటీవల కరోనా పాజిటవ్ రావడంతో...కొరియర్ సాయంతో....ఆసుపత్రిలో చేరేందుకు హన్మకొండ వస్తుండగా.. పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 88,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరోనాతో బాధపడతున్న మధుకర్‌ను... మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించినట్లు నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
ఇదీ చూడండి: విషాదం.. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య