వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని మానస బార్ అండ్ రెస్టారెంట్ ఎక్సైజ్ అధికారుల సీజ్ చేశారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్వాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. నర్సంపేటలోని మానస బార్ అండ్ రెస్టారెంట్‌కు ముందు సీజ్ చేసి ఉన్న వెనుక నుంచి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి బార్‌ను సీజ్ చేశారు.
ఆక్రమాలకు పాల్పడిని వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా గురించి మీరు విన్న వాటిలో ఏది నిజం?