ETV Bharat / technology

వాహన ప్రియులకు గుడ్​న్యూస్- ఓలా ఎలక్ట్రిక్ నుంచి 20 కొత్త ప్రొడక్ట్స్!

ఓలా ఎలక్ట్రిక్ కీలక ప్రకటన- భారీ సంఖ్యలో కొత్త ఉత్పత్తులు!

Ola EV Scooter
Ola EV Scooter (Ola Electric)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 10, 2024, 12:39 PM IST

Ola Electric: ఇండియాలో అతిపెద్ద టూ-వీలర్ ఈవీ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ కీలక ప్రకటన చేసింది. కంపెనీ ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు సంబంధించి సేవలను అందించడంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో కస్టమర్ల నుంచి తీవ్ర విమర్శనలను ఎదుర్కొంటున్న వేళ రాబోయే రెండేళ్లలో టూ-వీలర్, త్రీ-వీలర్ విభాగంలో అధిక సంఖ్యలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ కంపెనీకి చెందిన స్కూటర్లలో బ్యాటరీ ప్రాబ్లమ్స్, సడన్​గా ఆఫ్​ అయిపోవడం వంటి సమస్యల కారణంగా చాలామంది వినియోగదారులు ఓలా షోరూమ్స్​ ముందు బారులు తీరిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్​గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓవైపు కొత్త సర్వీస్‌ సెంటర్ల సామర్థ్యాన్ని పెంచుకుంటూనే మరోవైపు మరిన్ని కొత్త ప్రొడక్ట్స్​ను తీసుకురావడంపై కంపెనీ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే రానున్న రెండేళ్లలో ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగాల్లో 20 కొత్త ప్రొడక్ట్స్​ను లాంచ్‌ చేయాలనుకుంటున్నట్లు ఓలా తాజాగా ప్రకటించింది. ఇక నుంచి ప్రతి క్వార్టర్ పీరియడ్​లో ఓ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించింది.

ఇదిలా ఉండగా ఓలా స్కూటర్లకు సంబంధించి వినియోగదారులకు సరైన సేవలు అందించట్లేదని ఇటీవలే స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా లేవనెత్తారు. దీంతో సోషల్​ మీడియా వేదికగా కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌, కునాల్‌ కమ్రాకు మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే నడిచింది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు కూడా పతనమయ్యాయి. ఈ వివాదం తర్వాత కంపెనీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే తన షోరూంల సంఖ్యను పెంచడంతో పాటు కొత్త ఈవీ ప్రొడక్టుల గురించి కూడా ఓలా ఈ ప్రకటన చేయడం గమనార్హం.

కునాల్‌ కమ్రా, భవీశ్‌ అగర్వాల్‌ మధ్య వివాదం ఇదే!: ఓలా ఎలక్ట్రిక్‌కు తగినన్ని సర్వీస్ సెంటర్స్ లేవని, దీంతో కస్టమర్లు విసుగు చెందుతున్నారని పేర్కొంటూ మొదట కమెడియన్ కునాల్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై స్పందించిన కంపెనీ సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ 'నీ కామెడీ కెరీర్‌ పూర్తవడంతోనే ఇలాంటి పెయిడ్‌ పోస్టులు పెడుతున్నావు' అంటూ విరుచుకుపడ్డారు. ఓలా సర్వీసు సెంటర్ వద్ద విధులు నిర్వహిస్తే కామెడీ షోల కంటే ఎక్కువ మొత్తం ఇస్తానని భవీశ్ పేర్కొన్నారు. దీనికి ప్రతిగా కునాల్‌ కమ్రా సైతం 'అసంతృప్తితో ఉన్న కస్టమర్లకు పూర్తి రిఫండ్‌ ఇవ్వగలరా?' అంటూ సవాల్‌ విసిరారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. దీనిపై మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

చరిత్ర సృష్టించిన మారుతీ డిజైర్- క్రాష్​ టెస్ట్​లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్

బైక్ లవర్స్​కు గుడ్​న్యూస్- హీరో మోటోకార్ప్​ నుంచి నాలుగు కొత్త టూ-వీలర్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.