శిథిలావస్థ భవనం కూలి కిల్లా వరంగల్ పడమర కోటకు చెందిన వెంకటేశ్వర్లు మృతి చెందడం వల్ల గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రేటర్ పరిధిలోని పాత భవనాలను గుర్తించి వాటిని జేసీబీ సహాయంతో నేలమట్టం చేస్తున్నారు.
మిగిలిన వాటికి నోటీసులు...
గాంధీనగర్లో 20 పాత భవనాలను గుర్తించిన అధికారులు.. అందులో 8 భవనాలను కూల్చేశారు. మిగిలిన వాటికి నోటీసులు అందజేసినట్లు వివరించారు. శిథిలావస్థ భవనాలను విడిచి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని నగర పాలక సంస్థ అధికారులు సూచించారు. ఈ మేరకు స్వచ్ఛ ఆటోల ద్వారా ముమ్మర ప్రచారం చేస్తున్నారు.