మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో.. తీరొక్క రంగవల్లులతో ఏర్పాటు చేసిన పెద్ద పట్నం చూపరులను ఆకట్టుకుంటోంది.
ఒగ్గు కళాకారుల పూజల అనంతరం.. భక్తులు మల్లన్నను స్మరిస్తూ పెద్దపట్నంపై నడవడం ఇక్కడ ఆచారంగా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు.. కోరమీసాల స్వామిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు.
ఇదీ చదవండి: రాణి రుద్రమ నిర్మించిన శివకేశవాలయంలో ఘనంగా శివరాత్రి వైభవం