వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ను శిక్షణా కానిస్టేబుళ్లు సందర్శించారు. మడికొండలోని పోలీస్ శిక్షణా క్యాంపులోని 80 మంది వచ్చారు. కేసుల నమోదు, సాక్ష్యాల సేకరణ, పంచనామా నిర్వహణ వంటి తదితర అంశాలపై స్థానిక సీఐ అవగాహన కల్పించారు.
పోలీస్ స్టేషన్కి వెళితే తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉందని.. ఆ నమ్మకాన్ని నిలుపుకునే విధంగా పోలీసుల పనితీరు ఉండాలని సీఐ తెలిపారు. నేర సంఘటనలకు సంబంధించిన కేసులను త్వరితగతిన చేధించేందుకు వీలుగా.. సాంకేతిక నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: ఐనవోలులో బీరు సీసాతో గొంతుకోసి హత్య