వరంగల్ నగరంలో గణేశ్ నిమజ్జనం నిరాడంబరంగా జరుగుతోంది. తొమ్మిది రోజులు విశేష పూజలు అందుకున్న గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. నగరంలోని చిన్న వడ్డేపల్లి చెరువు, కరీమాబాద్ రంగసముద్రం వద్ద భక్తులు కొవిడ్ నిబంధలు పాటిస్తూ.. గణపతిని నిమజ్జనం చేస్తున్నారు.
గణపతి బప్పా మోరియా అంటూ భక్తులు చేసిన నినాదాలతో చెరువుల పరిసరప్రాంతాలు మారుమోగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: ఆంజనేయ స్వామి గుడిలోనే గణనాథుని నిమజ్జనం