ETV Bharat / state

పరకాలను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ స్థానికుల వినూత్న నిరసన

Locals Protest for Formation of Separate District Parakala : పరకాలను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ హనుమకొండ జిల్లా పరకాలలోని మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తమ అభిప్రాయాలను ముగ్గుల రూపంలో వెల్లడించారు. పరకాల అమరవీరుల త్యాగాలను దేశం సైతం గుర్తించాలని వారి స్మారకార్థంగా పరకాలను జిల్లా చేయాలంటూ నినాదాలు చేశారు.

District of Martyrs in Telangana
Locals Protest for Formation of Separate District Parakala
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2024, 6:49 PM IST

పరకాలను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ స్థానికుల వినూత్న నిరసన

Locals Protest for Formation of Separate District Parakala : ఒకప్పుడు ఆ ప్రాంతం విద్యా, వైద్యం, వ్యాపారంతో పాటు వివిధ అవసరాల నిమిత్తం వేలాది మంది వచ్చిపోతూ నిత్యం ప్రజలతో కళకళలాడుతూ ఉండేది. చుట్టుపక్కల మండలాలతో అతిపెద్ద తాలూకాగా పేరేన్నిక గన్న ఆ ప్రాంతం జిల్లాల విభజన తర్వాత కాలక్రమేణా ఆ ప్రాంతానికి రాకపోకలు తగ్గిపోయాయి. ఆరోగ్యరీత్యా అత్యవసర సమయంలో వేరే రాష్ట్రం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి చికిత్స చేసుకొని వెళ్లేవారు. అది మరెదో కాదు హనుమకొండ జిల్లాలోని పరకాల.

Parakala Amaradhamam : నాటి అమరవీరుల త్యాగాలకు గుర్తుగా పరకాల అమరదామం.. ఈ విశేషాలు తెలుసా..?

District of Martyrs in Telangana : గతంలో ఈప్రాంతంలో విలీనమై ఉన్న మండలాలు ప్రస్తుతానికి జిల్లాలుగా మారాయి. కానీ తాలూకాగా ఎంతో పేరున్న ఈ ప్రాంతం మాత్రం జిల్లాగా కాకుండా మున్సిపాలిటీగా మిగిలిపోయింది. హనుమకొండ జిల్లా(Hanmakonda) పరకాల ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఉద్యమాలకు పుట్టినిల్లుగా ఎంతో పేరున్న ప్రాంతం పరకాల. ఒకప్పుడు పరకాల ప్రాంతం చుట్టూ ఉన్న మండలాలతో కలిసి అతిపెద్ద తాలూకాగా ఉండేది.

పరకాల తాలూకా పరిధిలో ఉన్న మండలాలు కొన్ని జిల్లాలుగా మారాయి. గతంలో ఎలాంటి సరుకులు కొనుగోలు చేయాలన్న కిరాణం షాపు నుంచి మొదలుకుని బట్టలు, పాఠశాల, కళాశాలలతో పాటు వివిధ రకాల పనుల కోసం పరకాల ప్రాంతానికి ఎంతో మంది వచ్చి పోయేవారు. దాంతో స్థానికంగా వ్యాపారాలు ఎంతో సజావుగా సాగేవి. జిల్లాల విభజన సమయంలో పరకాల ప్రాంతం మున్సిపాలిటీకే పరిమితం అయ్యింది.

తెలంగాణ ఉద్యమ సమయంలో పరకాల(Parakala) ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉందని మరో జలియన్ వాలాబాగ్‌గా పరకాల ప్రశస్తి పొందిందని స్థానికులు పేర్కొంటున్నారు. అందుకు గుర్తుగా పరకాలలో అమరధామము నిర్మాణం జరిగిందని, అలాంటి పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నారు. అందులో భాగంగా నూతన సంవత్సరం సందర్భంగా పరకాల ప్రాంతంలో ఇండ్ల ముందు మహిళలు అమరవీరుల స్థూపాన్ని ముగ్గురూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తపరిచినట్లు పేర్కొంటున్నారు.

గతంలో వ్యాపారులతో కళకళలాడిన పరకాల ఇప్పుడు వెలవెలబోతోందని పరకాల ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానిక ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పరకాల అమరవీరుల త్యాగాలను దేశం సైతం గుర్తించాలని వారి స్మారకార్థంగా పరకాలను జిల్లా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

"తెలంగాణ ఉద్యమ సమయంలో పరకాల ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మరో జలియన్ వాలాబాగ్‌గా పరకాల ప్రశస్తి పొందింది. జిల్లాల విభజన సమయంలో పరకాల ప్రాంతం మున్సిపాలిటీకే పరిమితం అయ్యింది. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పరకాల అమరవీరుల త్యాగాలను దేశం సైతం గుర్తించాలని వారి స్మారకార్థంగా పరకాలను జిల్లాగా ఏర్పాటు చేయాలి". - స్థానికులు

కొమురవెల్లిలో మలన్న మూలవిరాట్​ దర్శనం నిలిపివేత - తిరిగి ఈనెల 7న పునః ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.