ETV Bharat / state

ప్రాణాలు పోయేదాకా పట్టించుకోరా..?

author img

By

Published : Mar 1, 2021, 9:48 AM IST

డంపింగ్ యార్డును జనావాసాలకు దూరంగా తరలించాలంటూ వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్‌లోని స్థానికులు డిమాండ్‌ చేశారు. యార్డు వల్ల అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు.

Locals in Kazipet demanded that the dumping yard be shifted away from uninhabited areas.
ప్రాణాలు పోయేదాకా పట్టించుకోరా..?

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం మడికొండ సమీపంలోని డంపింగ్ యార్డు.. చుట్టుపక్కల గ్రామాల పాలిట శాపంగా మారింది. సాయంత్రం 7 దాటిందంటే యార్డు నుంచి వచ్చే పొగ, దుర్వాసనతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో చెత్తకు నిప్పు అంటిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది.

డంపింగ్‌ యార్డ్‌పై గ్రామస్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో.. స్థానిక కార్పొరేటర్ జోరిక రమేష్ మూడు రోజుల క్రితం ఫైరింజన్‌తో యార్డ్‌లో మంటలను ఆర్పించారు. కానీ పరిస్థితి పునరావృతం కావడంతో స్థానికులు మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు తమ గ్రామంలో ఒక్క రాత్రి నిద్రిస్తే.. తమ బాధలు తెలుస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణ ప్రాంతాల నుంచి మున్సిపల్ వాహనాల ద్వారా ప్రతిరోజూ పెద్ద మొత్తంలో చెత్తను ఇక్కడకు తీసుకువచ్చి వేస్తున్నారు. డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్వాసన, విషవాయువులతో తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయి. గత ఐదేళ్లుగా రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నా.. ఫలితం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి యార్డుని తమ ప్రాంతం నుంచి తొలగించాలి.

- స్థానికులు

ఇదీ చదవండి: వేడెక్కుతున్న రాష్ట్రం... రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.