ETV Bharat / state

'సీసీఐ పత్తి కొనుగోలు చేసిన దాఖలాలు లేవు' - Warangal Enumamula Market updates

వరంగల్ ఎనుమాముల మార్కెట్​ను తెలంగాణ రైతు సంఘం నాయకులు సందర్శించారు. మార్కెట్​లో పత్తికి దక్కుతున్న ధరలను తెలుసుకున్నారు. 20 శాతం తేమ ఉన్నప్పటికీ పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సీసీఐని ఒప్పించకుండా.. తేమ శాతం 12 లోపు ఉండేలా చూడాలని రైతులకు సూచించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leaders of Telangana Farmers Association visited Warangal Enumamula Market
'సీసీఐ పత్తి కొనుగోలు చేసిన దాఖలాలు లేవు'
author img

By

Published : Nov 2, 2020, 4:45 PM IST

సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని ప్రకటనలు చేయడం తప్ప మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు చేసిన దాఖలాలు లేవని రైతు సంఘం నాయకుడు చందర్​రావు ఆరోపించారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్​ను తెలంగాణ రైతు సంఘం నాయకులు సందర్శించారు. తేమశాతం పేరిట పత్తి కొనుగోళ్లను సీసీఐ అధికారులు నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. 20 శాతం తేమ ఉన్నప్పటికీ సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు.

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతులకు 12 శాతం లోపు తేమ ఉన్న పత్తిని తీసుకురావాలని సూచించడం హాస్యాస్పదమన్నారు. వాతావరణ మార్పులతో 12 శాతం ఏ విధంగా వస్తుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్​ చేశారు. నిబంధనలను సడలించాలని లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'ఈనెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకు పిలుపునిచ్చిన ఏఐకేఎస్‌సీసీ'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.