ETV Bharat / state

ఓరుగల్లులో జోరు వానలు.. అలుగు పారుతున్న చెరువులు - వర్షాలు

వరంగల్​ నగరంలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. రెండు రోజులుగా భారీగా కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి.

lakes full with water in warangal city
నిండుకుండను తలపిస్తున్న చెరువులు
author img

By

Published : Jul 7, 2020, 4:25 PM IST

రెండురోజులుగా కురిసిన భారీ వర్షానికి వరంగల్​లోని చెరువులు, కుంటలు నిండు కుండను తలపిస్తున్నాయి. దేశాయిపేటలోని చిన్నవడ్డేపల్లి చెరువుతోపాటు ఉర్సు కరీమాబాద్​లోని రంగసముద్రం చెరువులు అలుగు పారుతున్నాయి.

చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోవడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిరోజులుగా నీరులేక బోసిపోయిన చెరువులు భారీ వర్షాల కారణంగా జలకళను సంతరించుకున్నాయి.

ఇవీ చూడండి: రాష్ట్ర నూతన సచివాలయం నమూనా విడుదల చేసిన సర్కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.