Kishan Reddy Visits Thousand Pillar Temple : దేశానికే తలమానికమైన వేయిస్తంభాల ఆలయ పునరుద్ధరణ పనుల కోసం రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కతికశాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కల్యాణమండపం పునరుద్ధరణ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపడతామని వివరించారు. వేయిస్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మండపం పునర్నిర్మాణ పనులపై కేంద్ర పురావస్తు శాఖ అధికారులు, స్థపతి, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Kishan Reddy Hanamkonda Tour : రూ.50 కోట్ల ఖర్చు చేసైనా రామప్ప ఆలయ అభివృద్ధికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. భద్రాచలంలో భక్తుల సౌకర్యార్థం మెరుగైన వసతులు కల్పిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మలుగు ప్రాంతంలో ట్రైబల్ సర్య్యూట్ పేరిట 100 కోట్లతో పర్యాటకంగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. అంతకుముందు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి భద్రకాళి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
"వరంగల్ అభివృద్ధికి మోదీ సర్కారు ఎంతో కృషి చేస్తోంది. వేయిస్తంభాల ఆలయం దేశానికే తలమానికం. కల్యాణమండపం పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. మండపం పునరుద్ధరణ పనులకు రూ.15 కోట్లు మంజూరు చేస్తాం."
- కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి
ఆలయాల సందర్శన అనంతరం కిషన్ రెడ్డి.. కేటీపీపీ అగ్నిప్రమాద ఘటన క్షతగాత్రులను పరామర్శించారు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యంపై వైద్యులను ఆరా తీశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్న ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందన్న కేంద్రమంత్రి.. వరంగల్‌లో చికిత్స పొందుతున్న నలుగురు ఆరోగ్యం నిలకడగానే ఉందని వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జెన్‌కో సింగరేణిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి :