ETV Bharat / state

ఈ చిన్నారుల సాయం 12 లక్షలు

వాళ్లు పిల్లలు. వృద్ధులకు తమ వంతుగా అండగా నిలవాలనుకున్నారు. దాచుకున్న సొమ్మును, ఇతరుల నుంచి సేకరించిన డబ్బును ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు.

చిన్నారుల సాయం
author img

By

Published : Mar 11, 2019, 5:58 PM IST

చిన్నారుల సాయం
వరంగల్​ పట్టణ జిల్లా హన్మకొండలో పబ్లిక్ పాఠశాల విద్యార్థులు...వృద్ధుల బాగోగులు చూసే హెల్పేజ్​ సంస్థకు 12 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. మానవ సేవేమాధవ సేవగా భావించిన చిన్నారులు తాము దాచుకున్న సొమ్మూ... తల్లిదండ్రులు, ఇతరుల నుంచి సేకరించిన మొత్తాన్ని వయసుపైబడ్డ వారికి ఇచ్చి ఆదర్శంగా నిలిచారు.

పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో నగదు మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు పాఠశాల ప్రిన్సిపల్, డైరెక్టర్‌ నాగేశ్వర్​రావు అందచేశారు. చిన్నపిల్లలైనా పెద్ద మనసుతో ముందుకొచ్చి సాయం చేశారని సంస్థ ప్రతినిధులు ప్రశంసించారు. ఇందులో భాగస్వాములైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఇవీ చూడండి:ఉమామహేశ్వర ఆలయంలో చోరీ

Intro:TG_Mbnr_09_10_Collector_SP_On_Elections_AB_C4

( ) సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగిందని, 17 వ లోక్ సభకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిందని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ వెల్లడించారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఎస్పీతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఎన్నికలు నిర్వహించేందుకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో పాటు పోలింగ్ అధికారులు సెక్టోరియల్ అధికారులను నియమించామన్నారు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాలో ప్రత్యేక టీములు, చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Body:జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో లోక్ సభ ఎన్నికలు నిర్వహించనున్నామని అందుకుగాను 15 లక్షల 1993 మంది ఓటర్లు ఉన్నట్టు వివరించారు. ఎన్నికలు నిర్వహించేందుకు 1871 పోలింగ్ బూత్లను సిద్ధం చేశామని అందుకుగాను 1730 కంట్రోల్ యూనిట్లు 2218 యూనిట్లు 1872 వీవీప్యాట్ యంత్రాలు అవసరమన్నారు. జిల్లాలో పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు శాఖ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి విధులతో శిక్షణ ఇచ్చామని ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. పోలింగ్ బూత్ స్థాయిలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.

Conclusion:బైట్స్
రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ రెమా రాజేశ్వరి మహబూబ్ నగర్ ఎస్పీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.