ETV Bharat / state

కరోనా కాలంలోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే రాజయ్య - వరంగల్ అర్బన్‌ జిల్లాలో చెక్కుల పంపిణీ

కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందిస్తున్నామని స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. వరంగల్ అర్బన్‌ జిల్లాలోని ధర్మసాగర్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు.

Kalyanalakshmi cheques distribution by MLA Rajaiah in warangal urban district
కరోనా కాలంలోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే రాజయ్య
author img

By

Published : Nov 5, 2020, 5:13 PM IST

వరంగల్ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో అర్హులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అందించారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు.

అర్హులైన రైతులకు వ్యవసాయ పట్టాదారు పాసుపుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. చెక్కులను ఆడపిల్లల తల్లిపేరు మీదుగా అందించడం ద్వారా వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతుందని తెలిపారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వ్యవసాయ భూములకు పూర్తి భద్రత కల్పిస్తుందని ఎమ్మెల్యే రాజయ్య పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది: కోదండరామ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.