వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలోని పేదలకు కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందించారు. నియోజకవర్గంలో ఉన్న 752 మంది లబ్ధిదారులకు రూ. 7.5 కోట్ల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పేదల ఇంట్లో పెళ్లి ఖర్చుల కోసం 672 మంది రూ. 6.75 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కరోనా వ్యాప్తి వల్ల రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్ బారిన పడిన వారి సంఖ్య కూడా పెరుగుతున్నందున.. ఈ వ్యాధి వల్ల అనారోగ్యంతో ఉన్న పేదలను ఆదుకునేందుకు..వారి వైద్య ఖర్చుల నిమిత్తం 80 మందికి రూ. 75 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఇవీచూడండి: ఈఎస్ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్