రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో ఎండీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తుల నమోదుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ అర్హత పరీక్ష నీట్-2021 అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తులు నమోదు చేసుకోవాలని వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 24 నుంచి ఈ నెల 28వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్ధులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని అధికారులు తెలిపారు.
ఇటు ఎండీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి రేపు, ఎల్లుండి రెండు రోజుల్లో తుది విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో ప్రాధాన్యత క్రమంగా వెబ్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి విడత కౌన్సిలింగ్ సీటు కేటాయింపైనా చేరని అభ్యర్ధులు... ఈ విడత వెబ్ కౌన్సెలింగ్కు అనర్హులని వర్సిటీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ చూడాలని చెప్పారు.
ఇదీ చదవండి: TS Inter exams: కొవిడ్ జాగ్రత్తలతో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం: బోర్డు కార్యదర్శి