Kaloji jayanthi Celebrations Telangana 2023 : కాళోజీ ఒక వ్యక్తి కాదు... మహాశక్తి. తెలంగాణ వైతాళికుడు. ప్రజల పక్షంవహించిన ప్రజాకవి, రచయిత, ఉద్యమకారుడు. అన్యాయాన్ని ఎదురించిన నిత్య చైతన్య శీలి. జీవితమే ఉద్యమంగా ఉద్యమమే ఊపిరిగా బతికిన మహామనిషి. రాజీ ఎరుగనితత్వం కాళోజీ సొంతం. అధిపత్యాన్ని ప్రశ్నించిన స్వభావం కాళన్నది. నిరంతరం వ్యవస్ధతో గొడవపడం ఆయన నైజం. మాండలికానికి పట్టం కట్టిన మహనీయుడు. అందుకే నేటి తరానికి ఆయన జీవితం... స్ఫూర్తిదాయకం.
Kaloji jayanthi Telangana 2023 : పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను ఆయన స్మరించుకున్నారు. మన భాషకు అస్తిత్వ స్పృహను పెంచడంలో కాళోజీది కీలకపాత్ర అని కొనియాడారు. కాళోజి స్ఫూర్తి, తెలంగాణ సాధనలో, ప్రగతిలో ఇమిడి ఉందన్నారు. తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజి పేరున ప్రతి యేటా పురస్కారాలను అందిస్తూ ప్రభుత్వం గౌరవించుకుంటున్నదని సీఎం పేర్కొన్నారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కాళోజీ పురస్కారాన్ని ఈ సంవత్సరానికి గాను అందుకుంటున్న, ప్రముఖ కవి జయరాజుకు కేసీఆర్ మరోసారి అభినందనలు తెలిపారు.
CM KCR on Kaloji jayanthi 2023 : మనషి మనిషిగా బతకలేని దౌర్భాగ్య పరిస్ధితి ఎదురైనప్పుడు అన్యాయం అవినీతి, అమానుషత్వం, దౌర్జన్యం విలయతాండవం చేసినప్పుడు.. కాళోజీ మండే సూర్యుడైయ్యాడు. ప్రతి చిన్న సంఘటనకు.. ఘర్షణకు కాళోజీ హృదయం స్పందించింది. కంఠం గద్గదమై.. కన్నీళ్లు నిండిన కళ్లతో ఆవేదన పెల్లుబికి.. అక్షరరూపం ధరించి.. మాహా కావ్యాలైయ్యాయి.
అవనిపై జరిగేటి అవకతవకలు చూచి..
ఎందుకో నా హృదిని ఇన్ని వేదనలు..
పరుల కష్టం చూసి కరిగిపోవను గుండె..
మాయ మోసము చూసి మండిపోవను ఒళ్లు..
అంటూ సమాజంలోని పరిస్ధితులు కల్గించిన ఆవేదనతో.. నాగొడవ గీతాలు రాశారు.. కాళోజీ.
అన్యాయాన్ని ఎదురిస్తే.. నా గొడవకు సంతృప్తి..
అన్యాయం అంతరిస్తే.. నా గొడవకు ముక్తిప్రాప్తి
అన్యాయాన్ని ఎదరించిన వాడే నాకు ఆరాధ్యుడంటూ..
ప్రశ్నించేవారు...అన్యాయాన్ని ఎదిరించేవారుంటే.. సమాజం కొంతవరకైనా బాగుపడుతుందని తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు కాళోజీ.
కాళోజీకి ఒక ప్రాంతమన్నది లేదు. దేశం మంతా పర్యటించారు. వేలాది సమావేశాల్లో ఉపాన్యాసాలు.. కవితాగానం చేశారు.
కులముతో పనిలేదు.. గుణము తోడను లేదు..
అందచందాలతో ఆవశ్యకము లేదు..
వయసుతో పనిలేదు.. వరుస తోడను లేదు
కలిమిలేములు రెండు కలసి సయ్యాటలాడు
మానవత్వము మెరుగు, మర్త్యలోకపు వెలుగు.. అంటూ విశ్వమానవతా సందేశం వినిపించారు.
కాళోజీ భాషకు పట్టం కట్టారు. తన హృదయానికి నచ్చని, జనహితానికి సరపడనిది దేన్నైనా.. తీవ్రమైన పదాలతో.. దనుమాడే తత్వం కాళోజీది. తెలుగు మాట్లాడటం నామోషీగా భావించే వాళ్లకు
తెలంగాణ అంటే సకల కళల ఖజానా: మామిడి హరికృష్ణ
తెలుగు భాషకు మళ్లీ పూర్వవైభవం రానుంది: రామా చంద్రమౌళి
ఏ భాషరా...నీది ఏమి వేషమురా
ఈ భాష.. ఈ వేశమెవరికోసమురా..
ఆంగ్లమందున.. మాట్లాడగలుగగనే..
ఇంతగా గుల్కెదవు.. ఎందుకోసమురా..
అంటూ అన్ని భాషలు నేర్చి ఆంధ్రమ్మురాదంచు..
సకిలించు ఆంధ్రుడా.. చావవెందుకురా అంటూ చురకలంటించారు కాళోజీ..
తెలంగాణ సంస్కతి సంప్రదాయాలపై.. వైవిధ్యంతో కూడిన ఎన్నో కవితలు రాశారు కాళోజీ. తెలంగాణ వాదాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు.
భాష...యాస అంటే మక్కువ కాళోజీకి. తెలంగాణ యాసనెపుడు యీసడించు భాసీయుల.. సుహృద్భావన ఎంతని.. వర్ణించుట సిగ్గు చేటు.. అంటూ తెలంగాణ యాసపై తన ఇష్టాన్ని కవితారూపంలో చాటారు కాళోజీ.. ప్రజల యోగక్షేమాలు పట్టించుకోని పాలకుల కారణంగా సమాజంలో ఏర్పడిన ధనికా పేదా తారతమ్యాలను
అన్నపురాసులు ఒక చోట..
ఆకలి మంటలు ఒకచోట..
కమ్ని చకిలాలొక చోట..
గట్టి దౌడలింకొక చోట..
అనుభవం అంతా ఒక చోట..
అధికారంబది ఒక చోట.. అంటూ కవితా రూపంలో ప్రస్తావించారు కాళోజీ
అభ్యర్ధి ఏపార్టీ వార్టీ వాడని కాదు.. ఏపాటి వాడో చూడు
ఇప్పటిదాకా ఏం చేశాడో చూడు..
పెట్టుకునే టోపీ కాదు.. పెట్టిన టోపీ చూడు.. అంటూ ఎన్నికల్లో మంచి అభ్యర్ధిని ఎన్నుకోవడం ఎంత ముఖ్యమో.. తెలియచేశారు కాళోజీ..
కాళోజీ గురించి.. తూటాల్లాంటి మాటలతో చురుకత్తుల్లా గుండెకు గుచ్చుకునే ఆయన కవితల గురించి.. ఎంత చెప్పినా ఎన్ని సార్లు చెప్పినా తక్కువే అవుతుంది. కాళోజీ ఒక కాలేజీయే.. వాడుక భాషలోని మాధుర్యాన్ని తెలిపి, అవినీతిపై అక్షరాలతో విరుచుకుపడి.. దోపీడికి గురౌతున్న సమాజంలో చైతన్యం నింపిన మహానుభావుడు మన కాళోజీ. అందుకే కేంద్రం.. పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించి..తనకు తాను సత్కరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కాళోజీకి సముచిత గౌరవం కల్పిస్తూ.. కాళోజీ జయంతిని అధికారా భాషా దినోత్సవంగా జరుపుతోంది. ఆయన జయంతి రోజున కవులు, కళాకారులకు ప్రతి సంవత్సరం కాళోజీ పురస్కారాలను అందచేస్తోంది. వరంగల్ లో ఆయన పేరుతో కాళోజీ హెల్త్ యూనివర్శిటీ నెలకొల్పింది. రూ.75 కోట్లు వెచ్చించి.. హనుమకొండలో కాళోజీ కళా క్షేత్రాన్ని నిర్మిస్తోంది.
న్యాయం కావాలి.. వర్షంలో ఆ 3 కళాశాలల వైద్య విద్యార్థుల ధర్నా..