ETV Bharat / state

పారామెడికల్​ పీజీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్​లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

kaloji Health univercity invites applications for paramedical PG courses
పారామెడికల్​ పీజీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం
author img

By

Published : Jan 22, 2021, 6:57 AM IST

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్​లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నేటి ఉదయం 9 గంటల నుంచి 27వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్​ను చూడాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి సైతం నోటిఫికేషన్​ను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఇవాళ, రేపు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సాయింత్రం 5 గంటల నుంచి రేపు సాయంత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.

ఇదీ చదవండి: కేస్లాపూర్‌లో నాగోబా జాతర వేడుకలకు రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.