రేపు వరంగల్ పర్యటనకు వెళుతున్న సీఎం కేసీఆర్.. మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించనున్నారు. గతంలో వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రతిసారి కేసీఆర్.. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీ కాంతారావు ఇంట్లో బస చేసేవారు.
సీఎం.. కడియం ఆతిథ్యం స్వీకరిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కడియంను పక్కన పెడుతున్నారని త్వరలోనే ఆయన భాజాపాలో చేరుతారనే ప్రచారం ఇటీవల భారీగా జరిగింది. తెరాసను వీడి భాజపాలో చేరిన ఈటల రాజేందర్‌ను కడియం శ్రీహరి విమర్శించడంతో ఆ ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పర్యటనకు కడియం ఆతిథ్యం ఇస్తుండటంతో మళ్లీ ఎమ్మెల్సీ ఇవ్వటంతో పాటు ప్రాధాన్యత గల పదవి ఖాయమన్న చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి: AADHAR,PAN: ఆధార్, పాన్ వివరాలివ్వండి.. రూ. 500 తీసుకెళ్లండంటున్న ముఠా..?