ETV Bharat / state

జర్మనీలోని నదిలో గల్లంతైన వరంగల్ యువకుడు

Telugu Young man washed away in Germany river: హనుమకొండ జిల్లా కరీమాబాద్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పై చదువుల కోసం జర్మనీకి వెళ్లిన కరీమాబాద్​కు చెందిన కడారి అఖిల్.. ప్రమాదవశాత్తు అక్కడ నదిలో కొట్టుకుపోయాడు. స్పందించిన మంత్రి కేటీఆర్.. జర్మనీ అధికారులతో మాట్లాడారు.

kadari akhil from karimabad washed away in water in germany
జర్మనీలో నదిలో కొట్టుకుపోయిన అఖిల్
author img

By

Published : May 9, 2022, 6:00 PM IST

Telugu Young man washed away in Germany river: హనుమకొండ జిల్లా కరీమాబాద్​కు చెందిన కడారి అఖిల్.. జర్మనీలోని ఓ నదిలో కొట్టుకుపోయాడు. పై చదువుల కోసం జర్మనీ వెళ్లిన అఖిల్ ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యాడు. ప్రమాదం విషయాన్ని మంత్రి కేటీఆర్​కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ట్వీట్ చేశారు. అఖిల్​ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన మంత్రి.. వెంటనే జర్మనీ అధికారులతో ఫోన్​లో మాట్లాడారు. అఖిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమారుడు నీళ్లలో కొట్టుకుపోవడంతో అఖిల్ కుటుంబంతో పాటు బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. అఖిల్ కుటుంబాన్ని ఎమ్మెల్యే నన్నపనేని పరామర్శించారు. తమ కుమారుడిని రక్షించేలా చర్యలు తీసుకోవాలని అఖిల్ తల్లిదండ్రులు ఎమ్మెల్యేను వేడుకున్నారు.

kadari akhil from karimabad washed away in water in germany
అఖిల్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే నరేందర్

ఇవీ చదవండి: పాలమూరు పచ్చబడితే కొంతమంది కళ్లు ఎర్రబడుతున్నాయి: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.