ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులకు రాజీనామా చేశామని చెప్పుకునే తెరాస నేతలు.. ఇప్పుడు కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం రాజీనామా చేసి పోరాటం చేయాలని జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. భాజపా, తెరాసలు రెండూ ప్రజలను రాబందుల్లా పీక్కు తింటున్నాయని ఆరోపించారు. కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం విద్యార్థులు, యువకులు, ప్రజాసంఘాలు, అన్ని వర్గాల వారు కలిసి రావాలని ఆయన కోరారు. ఈమేరకు వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
రెండూ ఒకే పక్షం..
సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాఘవరెడ్డి పలు విమర్శలు చేశారు. ఇరు పార్టీలు ఒకటేనని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు వచ్చిన ఓట్లను చూస్తుంటే తెరాస నైతికంగా ఓడిపోయినట్లే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే కాజీపేట్కి కోచ్ ఫ్యాక్టరీ మంజూరైందని... దానిని సాధించే తమ వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఓ మంచి ఆలోచన... కొందరికి ఉపాధి.. ఎందరికో ఆదర్శం.. అదెలా అంటే..!