ఉమ్మడి వరంగల్ జిల్లాలో లాక్ డౌన్ సడలింపులతో రోడ్లపై రద్దీ పెరిగింది. వరంగల్ అర్బన్ జిల్లాలో నిత్యావసర దుకాణాలతో పాటు ఎలక్ట్రికల్, ఐరన్ హార్డ్ వేర్ స్టీల్ తదితర షాపులు ప్రారంభమయ్యాయి. మద్యం దుకాణాల వద్ద రద్దీ కనిపించలేదు. గత 14 రోజలనుంచి ఎలాంటి కేసులూ నమోదు కాకపోవడం వల్ల రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌గా మారే క్రమంలో దుకాణాలు తెరిచేందుకు కోడ్ నంబర్ల కేటాయింపు జరుగుతోంది.
ఇప్పటికే జిల్లాకు చెందిన 26 మంది పాజిటివ్ వ్యక్తులు గాంధీ నుంచి డిశ్చార్జ్ కాగా... మరొకరు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంజీఎం కొవిడ్ వార్డులో కూడా అనుమానితులు ఎవరూ చేరలేదు. ఇతర రాష్ట్రాలనుంచి జిల్లాకు వచ్చేవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సమాచారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ వరంగల్‌లోని 27వ డివిజన్‌లో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, కార్పొరేషన్ వద్దిరాజు గణేశ్‌లు నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఇక వరంగల్ గ్రామీణ, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో నిత్యావసర దుకాణాలతో పాటు ఇతర షాపులు సరి, బేసి క్రమంలో తెరుచుకోవడం వల్ల రద్దీ పెరిగింది.
ఇదీ చూడండి: 'కరోనా ఎక్కువ కాలం ఉంటే.. ఆ సంస్థల పని అంతే'