వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో కు అపూర్వ స్పందన లభించింది. 24 స్టాళ్లలో ఏర్పాటు చేసిన విభిన్న రకాల అధునాతన కార్లు చూపరులను కట్టిపడేశాయి. కార్లతో పాటు ద్విచక్ర వాహనాల ప్రదర్శన కూడా ఆకట్టుకుంది.
హయగ్రీవచారి మైదానంలో రెండు రోజుల పాటు జరిగే ఈ ఆటో షోను వరంగల్ అర్బన్ జిల్లా రవాణా శాఖ అధికారి వేణు, వరంగల్ గ్రామీణ జిల్లా రవాణా శాఖ అధికారి మహబూబ్ హుస్సేన్ ప్రారంభించారు. కొనుగోలు దారులు పెద్ద ఎత్తున ప్రదర్శనను తిలికించి తమకు ఇష్టమైన వాహనాలను బుక్ చేసుకుంటున్నారు.
మారుతి నెక్సా, ఆడి, స్కోడా,జీపు, బెంజ్, హోండా, హ్యూందాయ్, ఫోర్డ్, రెనాల్ట్, మహింద్రా, సుజుకీ, హోండా వంటి తదితర వాహనాల ప్రదర్శనలు వాహన ప్రియులను అలరించనున్నాయి. ఆటో షోలో ఏర్పాటు చేసిన ఎస్.బి.హెచ్. స్టాలులో బ్యాంకు రుణాలకు సంబంధించిన వివరాలు అందిస్తున్నారు.
ఇవీ చూడండి: దమ్ము చూపండి.. దుమ్ము లేపండి