ఆడపిల్లకు జన్మనిస్తే రూ.10 వేల కానుక అందిస్తానని వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఆదర్శగ్రామమైన మరియపురం సర్పంచి, నిర్మల ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ అల్లం బాలిరెడ్డి ప్రకటించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుకన్య సమృద్ధి యోజన కింద ఆడబిడ్డ పేరిట బ్యాంకులో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయనున్నట్లు వెల్లడించారు.
2019 ఫిబ్రవరిలో సర్పంచిగా తాను పదవి చేపట్టిన నాటి నుంచి గ్రామంలో 8 మంది ఆడపిల్లలు జన్మించారని వారందరి పేరిట డబ్బు డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. తాను పదవిలో ఉన్నంత వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానన్నారు. ఈ నెల 20న నిర్మల ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 8 మంది బాలికల తల్లిదండ్రులకు డిపాజిట్ పత్రాలు అందజేస్తామన్నారు.
ఇదీ చదవండి: Child marriages in Telangana : షాదీముబారక్ నగదు కోసం.. పథకం ప్రకారం పెళ్లి